సాయిపల్లవి ఫొటోలు వైరల్‌!

హైదరాబాద్‌: ‘ఫిదా’ భామ సాయిపల్లవి విషు లుక్‌లో ఉన్న ఫొటోల్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ‘ఈ ఏడాది విషు (ఉగాది) చాలా తొందరగా వచ్చేసింది’ అని ట్వీట్‌ చేశారు. కేరళ సంప్రదాయం ప్రకారం ధరించే బంగారు వర్ణం జరీ ఉన్న తెలుపు రంగు చీరలో ఆమె మెరిశారు. ఈ లుక్‌లో నటి చాలా బాగున్నారని నెటిజన్లు కామెంట్లు చేశారు. కేవలం మూడు గంటల్లోనే 15 వేల మందికిపైగా ఫొటోల్ని లైక్‌ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఫొటో షూట్‌లో భాగంగా ఆమె ఇలా రెడీ అయినట్లు తెలుస్తోంది.