అమ్మాయైతే మహేష్‌తో కాపురం

అమ్మాయైతే మహేష్‌తో కాపురం చేసేవాడట!

    ఛాన్స్‌ కోసం పోసాని పాట్లు! అన్నీ ఇన్నీ కావు. అందరినీ విమర్శిస్తూ ఏదో విధంగా హైలైట్‌ అవ్వానుకునే ఆయన రెండాకుల ఎక్కువ చదివాడు. అందుకే ఏదో రకంగా సభల్లో మాట్లాడుతుంటాడు. ఇక కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలంటే ఎంతోమందిని ఇంప్రెస్‌ చేయాలి. అలాంటిది గత కొన్నేళ్ళుగా పాతుకుపోయిన పోసాని కృష్ణమురళీ కూడా హీరో, దర్శకుల ప్రాపకం చేసుకునేందుకు నానా తంటాలు పడుతుండడం విశేషమే మరి. తాజాగా ఆయన మహేష్‌బాబు నటించిన 'మహర్షి'లో ఓ పాత్ర పోషించాడు. రైతుల్ని మోసం చేసే కపట రాజకీయనాయకుడిలా నటించాడు. కాగా, మహర్షి చిత్రం సక్సెస్‌మీట్‌లో ఆయన పాల్గొని మహేష్‌బాబును ములగచెట్టు ఎక్కించేశాడు. ఆయన మాటల్లోనే.. మహేష్‌బాబు చాలా అందంగా వున్నాడు. నేనే కనుక ఆడపిల్లనైతే తను పెళ్లి చేసుకునే వరకు వెంటపడేవాడిని. ఒక వేళ్ళ పెళ్లయిపోతే ఏదో ఒక ప్లేస్‌ ఇస్తే చూసుకుంటూ ఉండిపోతానని చెప్పేసేవాడిని. అంటూ అంతకరశ్టుద్ధితో మాట్లాడాడు. ఇలాంటి ట్రిక్స్‌లు ఇండస్ట్రీలో ఎక్కువయ్యాయి. ఆడియో వేడుకలో, సక్సెస్‌మీట్‌లో సదరు ఆర్టిస్టులు రకరకాలుగా తమకు కావాల్సిన వారిని ఎత్తేస్తూ పబ్బం గడుపుకుంటుంటారు.