శీనయ్య కథే ఆసక్తి ..

శీనయ్య కథే ఆసక్తి 

నటీనటు: విజయ్‌ దేవరకొండ-రాశి ఖన్నా-ఐశ్వర్యా రాజేష్‌-కేథరిన్‌ థ్రెసా-ఇజబెల్లా-ప్రియదర్శి-జయప్రకాష్‌ తదియి
సాంకేతికత: సంగీతం: గోపీసుందర్‌, ఛాయాగ్రహణం: జయకృష్ణ గుమ్మడి, నిర్మాత: కె.ఎ.వ్లభ, రచన-దర్శకత్వం: క్రాంతిమాధవ్‌.

     విజయ్‌ సరసన నుగురు హీరోయిన్లు వున్నారు. విజయ్‌దేవర కొండ నాుగు క్యారెక్టర్లు చేశాడా! మరోవైపు ఈ సినిమా తర్వాత ఈ తరహా ప్రేమకథు చేయనని స్టేట్‌మెంట్లు.. సినిమాపై అంచనాు పెంచాయి. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి సినిమాను క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌పై చేసిన దర్శకుడు క్రాంతి మాధవ్‌ రెండో ప్రయత్నంగా ఆ బేనర్‌లో చేశాడు. ‘వరల్డ్‌ ఫేమస్‌ వర్‌’ అనే టైటిల్‌ క్రేజ్‌ ఏర్పడిన ఈ చిత్రం విదేశీయు క్చర్‌ అయిన ప్రేమికు రోజున విడుదలైంది. అదెలా వుందో చూద్దాం.
కథ: గౌతమ్‌ (విజయ్‌ దేవరకొండ) అనాథ. యామిని (రాశి ఖన్నా) తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె నాన్న అంగీకరించకపోవడంతో సహజీవనం చేస్తుంటారు. తను ఉద్యోగి. ఇతను నిరుద్యోగి. రచయిత కావానే ఎయిమ్‌. కానీ ముందుకు వెళ్ళడు. గౌతమ్‌ విధానంతో విసిగిపోయి తెగతెంపుతో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గౌతమ్‌ పిచ్చోడితరహాలో అతనిలో అర్జున్‌రెడ్డి బయటకు వస్తాడు. ఆ తర్వాత యామిని మాటు సవాల్‌గా స్వీకరించి కథు రాస్తుంటాడు. తను ఇలాగైతే ఎలా వుంటాననే కోణంలో మూడు కథు రాస్తాడు. అదే సినిమాలోని ఉపకథు. ముగ్గురు హీరోయిన్లు వుంటాయి. ఆ కథు ఎలా వున్నాయి? చివరికి యామిని, గౌతమ్‌ు కలిశారా? లేదా? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ: 
సినిమా మొత్తంగా బొగ్గు గనుల్లో పనిచేసే శీనయ్య పాత్ర, భార్య సువర్ణ పాత్ర ఐశ్వర్య రాజేష్‌ ఎపిసోడ్‌ మినహా మిగిలినదంతా ఏమంత ఆసక్తికల్గించదు. కార్మికనాయకుడు శీనయ్య పాత్ర మన ఇండియన్‌ క్చర్‌కు వాస్తవానికి దగ్గరగా వుంది. మిగిలిన మూడు కథు వాస్తవానికి దూరంగా వుంటాయి. బొగ్గు గను అధికారిణిగా క్యాథరిన్‌ పాత్ర చేసింది. శీనయ్యకు పెళ్లి అయిందనే విషయం చివరివరకు తెలియకపోవడం కథలోని తప్పిదం. ఇక పారిస్‌లో వున్న ఇజబెల్లా పాత్ర, ఆ కథ అంతా సాగదీసినట్లుగా వుంటుంది. ప్రమాదంలో కళ్లు కోల్పోయిన ఆమెకు కళ్ళు దానం చేయడం అనేది లాజిక్‌లేకుండా వుంది. రాశీఖన్నా పాత్ర ప్రేమించిన గౌతమ్‌ను అసహ్యించుకునేపాత్రలో బాగానే చేసింది. ఆమెను మెప్పించేందుకు గౌతమ్‌ పాత్ర జీవించాడనే చెప్పాలి. ఆ తర్వాత రాశీఖన్నా అవమానించడంతో తను రచయితగా ఎదిగేందుకు స్నేహితుడు ప్రియదర్శి చేసిన ప్రోత్సాహం చిత్రానికి ఆకర్షణ. ఈ తరహా కథు గతంలో వచ్చాయి కూడా. తను రాసిన ‘వరల్డ్‌ఫేమస్‌ వర్‌’ పుస్తకం ప్రింట్‌ అయి ఏకంగా 50 క్ష కాపీు అమ్ముడై రికార్డు సృష్టిస్తుంది. చదివిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతారు. కన్నీళ్లు పెట్టేసుకుంటారు. ఈ కథ రాసిన రచయితకు క్ష మంది అభిమాను తయారవుతారు. అతడి కోసం పడి చచ్చిపోతుంటారు. క్లైమాక్స్‌ కూడా లేకుండానే ప్రచురితమైన అద్భుతమైన స్పందన తెచ్చుకున్న ఈ కథకు హీరో ఎలాంటి ముగింపునిస్తాడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. కానీ వాళ్ల ఎగ్జైట్మెంట్‌ అంతా చూసి అసు వీళ్లు ఈ కథతో ఇంతగా ఎలా కనెక్టయిపోయారు.. ఇందులో ఏమంత ఉద్వేగం ఉందని.. ఏం ప్రత్యేకత ఉందని అనే సందేహాు ప్రేక్షకుకు కుగుతాయి. సహజంగా దర్శకుడు అనుభవాు కథల్లో కనబడుతాయి. ఇందులో అలానే అనిపిస్తుంది. తనుకూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేని విదేశానుంచి ఇండియా వచ్చి రచయిత, దర్శకుడు కావానుకుంటాడు. అది గౌతమ్‌ పాత్రలో కన్పిస్తుంది. తన కథ పట్ల క్రాంతి మాధవ్‌ అంత భావోద్వేగానికి గురైతే అయి ఉండొచ్చు కానీ.. ఒక దశా దిశా లేకుండా సాగిపోయే ‘వరల్డ్‌ ఫేమస్‌ వర్‌’ కథతో సగటు ప్రేక్షకుడు కెన్ట్‌ కావడం మాత్రం కష్టమే. ఫైనల్‌గా ఇది నా కథే. ముగింపు అనేది నాకే తెలిదు. తను ఎక్కడున్నా బాగుండాని కోరుకుంటానని స్పీచ్‌ ఇస్తాడు గౌతమ్‌. దానింతో ముగింపు కార్డు పడితే బాగుండేది. కానీ సినిమాటిక్‌గా మార్చాని చివరికి రెండేళ్ళపాటు తను పెళ్లిచేసుకోకుండా రాశీఖన్నా రావడం... అదేది కృతంగా వుంది. ఇదంతా తొగు సినిమా కథకు పాజిటివ్‌ ముగింపు కోసమేనని అర్థమవుతుంది. 
ఈమధ్య కథు ఓవర్‌సీస్‌ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్నవే. అందులో భాగమే ఈ సినిమా. ఇందులో శీనయ్య పాత్రకు అందరూ కనెక్ట్‌ అవుతారు. మిగిలిన కథంతా సోసోగానే వుంటుంది.  విజయ్‌ దేవరకొండ డ్రైవింగ్‌ ఫోర్స్‌ లాగా నిబడ్డప్పటికీ.. కనెక్ట్‌ కాలేని కథ ప్రధాన పాత్ర మూంగా ‘వరల్డ్‌ ఫేమస్‌ వర్‌’ ప్రేక్షకుకు రుచించని విధంగా తయారైంది. కొన్ని మూమెంట్స్‌ బాగున్నప్పటికీ ఓవరాల్‌ గా ఈ సినిమా నిరాశపరుస్తుంది. టెక్నికల్‌గా సంగీతం ఏమాత్రం ఆకట్టుకోదు. అందుకు కారణంగా వినసొంపైన పాటు లేకపోవడమే. ప్రియదర్శి జయప్రకాష్‌ సహాయ పాత్రల్లో తమ ఉనికిని చాటుకున్నారు. ప్రేమలోని గాఢతను చెప్పే ప్రయత్నంలో అతను దారి తప్పి ఎక్కడికో వెళ్లిపోయాడు. నికడ లేని కథాకథనాతో అతను ఉస్సూరుమనిపించాడు.