నిర్మాతను మోసం చేసిన రాజమౌళి శిష్యుడు!

నిర్మాతను మోసం చేసిన రాజమౌళి శిష్యుడు!

    సినిమారంగంలో కొత్త నిర్మాతలు వస్తుంటారు. కొందరు పోతుంటారు. కొందరు నిలబడుతుంటారు. ఇక్కడ ఎవరిని నమ్మాల్లో నమ్మకూడదో తెలీదు. కానీ తెలివిగా చెప్పిన మాటలకు పడిపోతుంటారు. అలాంటి సంఘటనలు చాలానే వున్నాయి. అందులో ఒకటి.. 'చంద్రుడిలో వుండే కుందేలు' అనే చిత్రం విశేషం. ఆ చిత్ర నిర్మాతకు దర్శకుడు విమానంలో కలిశాడు. మాటామాటా కలిసింది. తాను పెద్ద డైరెక్టర్‌ రాజమౌళి శిష్యుడినంటూ పరిచయం చేసుకున్నాడు. అలా.. అలా.. ప్రయాణంలోనే కథ చెప్పడం.. ఆకాశంలో ప్రయాణిస్తున్నారు కాబట్టి.. చంద్రుడు తరహాలో ఆకాశానికి ఎత్తే కథ చెప్పాడు. ఆ నిర్మాత పడిపోయాడు. సినిమా ఆరంభానికి ముందుగా 80లక్షలు ఆయన అకౌంట్‌లో జమచేసేశాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ముందుగా భారీగా షెడ్యూల్‌ ప్లాన్‌ చేసి జూనియర్‌ ఆర్టిస్టులతో పెద్ద ఎత్తున యాక్షన్‌ సీన్‌ తీసేశాడు. ఆ తర్వాత మరికొత టాకీ తీశాడు. హీరో హీరోయిన్లు కొత్తవారే. వారి దగ్గరనుంచి డబ్బులు తీసుకున్నాడు ఈ దర్శకుడు. ఇంతకీ ఆ నిర్మాత ధన శ్రీనివాస్‌. దర్శకుడు వెంకట్‌ రెడ్డి.  ప్రారంభోత్సవం ఆర్భాటంగానే జరిగింది. నిర్మాత తనకు తెలిసిన రాష్ట్రమంత్రిని కూడా పిలిపించాడు.

    అలా మొదటి షెడ్యూల్‌ పూర్తయ్యేసరికి నింపాదిగా షూటింగ్‌ జరుగుతుంది. కొంత గ్యాప్‌ ఇచ్చి మరికొంత అమౌంట్‌ తీసుకున్నాడు నిర్మాతనుంచి.. ఇలా రెండుసార్లు ఇచ్చాక.. ఇతని దర్శకత్వంలో తేడా కన్పించింది. చివరికి అంక్వెయిరీ చేస్తే అతను రాజమౌళి శిష్యుడు కాదని తెలిసింది. సో.. ఆ తర్వాత తెలిసిందే.. నిర్మాత దర్శకుడ్ని నిలదీయడంతో.. సినిమా ఆపేశాడు. పూర్తికావాలంటే మరికొంత అమౌంట్‌ ఇవ్వాలన్నాడు. ఇంకేముంది. అప్పటికే సినిమారంగం గురించి బాగా అర్థంచేసుకుని ఛాంబర్‌లో ఫిర్యాదు చేసినా సరైన ప్రూఫ్‌లేకపోవడంతో నిర్మాత చేసేదిలేకపోయింది. ఇంత ప్లాన్‌గా బుట్టలో పడేసిన దర్శకుడు దక్కింది ఏమిటో తెలుసా... మొదట అడ్వాన్స్‌తో  తనకు ఇల్లు కొనేసుకున్నాడు. ఆతర్వాత అమౌంట్‌తో కారు కొనేశాడు. సో... ఆ సినిమా ఆగిపోయింది. రిలీజ్‌ చేయడానికి నిర్మాత దగ్గర డబ్బులులేవు.  కనుక.. ఇలాంటి వాల్లు ఈ రంగంలో వుంటారు. జాగ్రత్త సుమా...