త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా  సరుకుల పంపిణీ

సినీకార్మికుల‌ కుటుంబాలకు

త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా  సరుకుల పంపిణీ ప్రారంభం

సినీ-టీవీ కార్మికులకు సాయం అందించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్,  తలసాని సాయికిరణ్ యాదవ్  ముందుకు వచ్చారు. 14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా నిత్యావ‌స‌రాల సాయం ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం ప్రారంభించారు. వారిలో 12 వేల మంది సినీ , 2 వేల మంది టీవి కార్శికుల కు మొత్తం 14 వేల మందికి నిత్యావసరాల పంపిణీ అన్నపూర్ణ 7ఎకర్స్ లో సరుకుల పంపిణీ  ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న  అక్కినేని నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, కొరటాల శివ ,రాధాకృష్ణ, రామ్ మోహనరావు , తలసాని సాయి, ఎన్.శంకర్ , సి.కళ్యాణ్, అభిషేక్, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, కొరటాల శివ ,రాధాకృష్ణ, రామ్ మోహనరావు , తలసాని సాయి, ఎన్.శంకర్ , సి.కళ్యాణ్  చేతుల‌మీదుగా కార్శిక యూనియన్ నాయకుల ద్వారా నిత్యావసర వస్తువుల ను అందించారు.