చిరంజీవి, నాగార్జునతో సిట్టింగ్ వేశాం

చిరంజీవి, నాగార్జునతో క‌రోనాకు ముందే సిట్టింగ్ వేశాం
సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై  త‌ల‌సాని  
 

లాక్‌డౌన్ త‌ర్వాత చిత్ర‌ప‌రిశ్ర‌మ చాలా న‌ష్టాల్లో కూరుకుపోయింది. నిర్మాత‌లు చాలామంది వ‌డ్డీల‌కు డ‌బ్బులు క‌ట్టే స్థితి లేదు. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో సినిమాల‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌నులు జ‌రుపుకునేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కానీ తెలంగాణ‌, ఆంధ్ర‌లో ఆ ఊసే లేదు. ఈ విష‌య‌మై మంగ‌ళ‌వారంనాడు హైద‌రాబాద్‌లో సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ మాట్లాడుతూ.. అది కేర‌ళ ప్ర‌భుత్వం ఏవిధంగా తీసుకుంద‌నేది కూలంక‌షంగా ప‌రిశీలించి మ‌న  సినీ పెద్ద‌ల‌తో మీటింగ్ వేసి త‌గు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కంటే ముందే సినీరంగంలో వున్న చాలా స‌మ‌స్య‌లు.. మారుతున్న టెక్నాల‌జీ వ‌ల్ల ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నేది చిరంజీవి, నాగార్జున‌తో కె.సి.ఆర్‌. చ‌ర్చించారు. వారు కొన్ని సూచ‌న‌లు చేశారు. అదేవిధంగా సినీ పెద్ద‌లు కూడా చ‌ర్చించారు. హ‌ఠాత్తుగా క‌రోనా మీద ప‌డింది. క‌నుక ఇప్పుడు కూడా మ‌రోసారి లాక్‌డౌన్ ఎత్తివేశాక‌.. చిరంజీవి, నాగార్జున మ‌రికొంత‌మంది సినీ పెద్ద‌లు, ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌, తెలంగాణ ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో మీటింగ్ వేసి సినీరంగ కార్మికుల స‌మ‌స్య‌ల‌పై మంచి చేయాల‌ని చూస్తున్నాం అన్నారు.
ఈ సంద‌ర్భంగా విలేక‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధాన‌మిచ్చారు. థియేట‌ర్ల గురించి మాట్లాడుతూ... ఏవిధంగా సీటింగ్ వుండాల‌నేది ముందు ప‌రిశీలిస్తాం. పైగా.. అస‌లు థియేట‌ర్లు ఓపెన్ చేస్తే ప్రేక్ష‌కులు వ‌స్తారారారా అనేది కూడా ప‌రిశీలించాలి. అంత త్వ‌రంగా వ‌స్తార‌ని నేను అనుకోవ‌డం లేదు అన్నారు.
చాలా ప్ర‌శ్న‌ల‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం కేబినె్ట్ మీటింగ్ జ‌రుగుతుంది.  ఆ త‌ర్వాత నిర్ణ‌యాలు ఏమి తీసుకున్నార‌నేది తెలియ‌జేస్తామ‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా తెలుగు ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో సి.క‌ళ్యాణ్‌, తెలంగాణ ఛాంబ‌ర్ త‌ర‌ఫున నారాయ‌ణ‌, విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, నిర్మాత‌ల‌మండ‌లి త‌ర‌ఫున న‌ట్టికుమార్ ప‌లువురు త‌మ స‌మ‌స్య‌ల‌ను మంత్రి ముందు నివేదిక స‌మ‌ర్పించారు. వాటిని ప‌రిశీలించి త్వ‌ర‌లో నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు.