రేవంత్ అంత ప‌ని చేశాడా...!

రేవంత్ అంత ప‌ని చేశాడా!

 

ఇటీవ‌లె తెలుగుదేశం పార్టీ నుంచి  కాంగ్రెస్ పార్టీకి లో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్‌రెడ్డి పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయ‌న‌ తిరుగుబాటు బావుట‌ ఎగ‌ర‌వేయ‌బోతున్నారా అన్న‌ది ఈ మ‌ధ్య జ‌రిగిన‌టువంటి ప‌రిణామాలైతే ఆ తిరుగుబాటు బావుటాకి ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. అది ఈ రోజు అసెంబ్లీ లాబీల్లో ఆయ‌న మాట్లాడిన‌టువంటి మాట్ల‌ల్లో ముఖ్యంగా  గ‌మ‌నించాల్సిన అంశాలేమిటంటే గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసేందుకు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఒక సిఎల్ పి స‌భ్యుడుగా ఉన్న రేవంత్‌కు క‌నీస స‌మాచారాన్ని కూడా ఇవ్వ‌లేద‌ని ఆయ‌న అన్నారు. కాంగ్రెస్‌లో ఎప్పుడు ప‌ద‌వి వ‌స్తుందో ఎప్పుడు పోతుందో ఎవ‌రికీ తెలియ‌దు. హుజుర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక టికెట్టు అధిస్ఠానం ఎవ‌ర్నీ ఎంపిక చెయ్య‌లేదు. హుజుర్ న‌గ‌ర్ ఎన్నిక‌ల్లో పోటీకి శ్యామ‌ల‌, కిర‌ణ్‌రెడ్డిని ఆయ‌న‌ ప్ర‌తిపాదిస్తున్నారు.  అత‌ను అక్క‌డి స్థానికుడు. ఇవి ఆయ‌న ప్ర‌స్థావించిన అంశాలు. త‌ర్వాత ఏఐసిసి కార్య‌ద‌ర్శులుగా ఉండి మ‌హారాష్ట్ర‌లో ఎన్నిక‌లు వ‌దిలిపెట్టి సంప‌త్ వంశీల‌కు ఈ మీటింగుల్లో ప‌నేంటి అన్న‌టువంటి విమ‌ర్శ‌ల‌తో పాటుగా రాష్ట్ర ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న అవినీతి పై బిజెపి వాళ్లే మ‌న‌కంటే బెట‌ర్‌గా మాట్లాడుతున్నారు అన్న‌టువంటి స్టేట్‌మెంట్  ఇచ్చారు. ఏకంగా కుంతియాకి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నేరుగా స్టేట్‌మెంట్ ఇచ్చి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి  ఎలా డైరెక్ట్‌గా నిల‌దీస్తార‌నే ప‌రిస్థితి. ఇక్క‌డ సూర్య‌పేట జిల్లా హుజుర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌కి అభ్య‌ర్ధిగా కొత్త పేరు ఉత్త‌మ్ ప‌ద్మావ‌తికి టికెట్టు వ‌ద్ద‌నిచెప్పి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి పేరుని తీసుకురావ‌డంతోపాటుగా ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి స‌న్నిహితుడు ఇటీవ‌లే రేవంత్ వ‌ర్గంలోకి వ‌చ్చిన‌టువంటి కిర‌ణ్‌రెడ్డి కోసం ఆయ‌న తిరుగుతూ  స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం ఒక ఎత్తైతే ఉత్త‌మ్‌కి షోకాజ్ నోటీస్ ఇవ్వాల‌ని చెప్పి డైరెక్ట్‌గా కుంతియాని కోర‌డ‌మ‌నేది ఇక్క‌డ ప్ర‌ధాన అంశం. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుస్తుందని వెళ్లారు కాని అది ఓట‌మిపాలైంది. ఆయ‌న మాతృ పార్టీ అయిన‌ తెలుగుదేశాన్ని కూడా తీసుకువ‌చ్చారు. ఇద్ద‌రు క‌లిసిన అన్ని పార్టీల‌నీ క‌లిపిన ఓట‌మి ఎదురైంది. ప్ర‌స్తుతం పార్టీలో ప‌రిస్థితులు చూస్తుంటే ఆశించినంత పెర్‌ఫార్మెన్స్ లేదు. పేరుకి హోదా ఉన్నా కూడా పార్టీలో అంద‌రూ పెద్ద‌లే కావ‌డంతో  రేవంత్‌రెడ్డి మాట చెల్ల‌డంలేదు. దీంతో తాజా ప‌రిస్థితులు ఆయ‌న బిజెపి వైపు చూస్తున్న‌ట్లు తెలుస్తుంది. బిజెపి వెర్సెస్ టిఆర్ ఎస్ అని వెళ్ళ‌డంతో ఓపెన్‌గా తిరుగుబాటు ప్ర‌క‌టించారు. ఏకంగా పీసీసీ చీఫ్ మీదే తిరుగుబాటు లేదా పీసీసీ ప‌ద‌వి కోసం ఈ విధ‌మైన‌టువంటి ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని కొంద‌రు భావిస్తున్నారు.