పాయిజ‌న్ ప్రారంభం

పాయిజ‌న్ ప్రారంభం
   

            ష‌ఫీ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న పాయిజ‌న్‌.. చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. డిస్ట్రిబ్యూట‌ర్‌, నిర్మాత శోభారాణి కుమారుడు ర‌మ‌ణ క‌థానాయ‌కుడుగా న‌టిస్తున్నాడు. ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కె. శిల్పిక నిర్మాత‌. చిత్రం గురించి ద‌ర్శ‌కుడు తెలుపుతూ.. క్రైం, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్ అంశాల‌తో రూపొందుతోంది. ప్రేక్ష‌కుల‌ని క‌ట్టిప‌డేసే మ‌లుపులు ఇందులో వున్నాయి. హీరోయిన్లుగా ప్ర‌ముఖ మోడ‌ల్స్ న‌టిస్తున్నారు. అని తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ.. థ్రిల్ల‌ర్ అయినా పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా సాగుతుంద‌ని పేర్కొన్నారు. ష‌ఫీ మాట్లాడుతూ.. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన త‌న‌కు ఈ చిత్ర క‌థ బాగా ఆక‌ట్టుకుంద‌నీ, మంచి పేరు తెచ్చే చిత్ర‌మ‌వుతుంద‌ని తెలిపారు. ద‌ర్శ‌కుడు క‌థ చెప్పిన విధానం చాలా బాగుంద‌ని తెలిపారు. హీరో ర‌మ‌ణ మాట్లాడుతూ.. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు అందించిన మా త‌ల్లిదండ్రులు ఎంతో స‌పోర్ట్‌గా నిల‌బ‌డి హీరోను చేశారు. ఈ క‌థ‌కు త‌గినట్లుగా పాత్ర‌లో ఒదిగిపోతాను. అందుకు ద‌ర్శ‌కుడు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పూనెలో న‌టుడిగా త‌ర్ఫీదు తీసుకుని వ‌చ్చాను అని తెలిపారు. మోడ‌ల్్స నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ముంబై, డెహ్రాడూన్ మోడ‌ల్స్ న‌టించ‌డం విశేషం.

News_Tags: