అందరూ మెచ్చే ‘భీష్మ’

అందరూ మెచ్చే ‘భీష్మ’

నటీనటు: నితిన్‌-రష్మిక మందన్న-అనంత్‌ నాగ్‌-జిష్ణు సేన్‌ గుప్తా, వెన్నె కిషోర్‌-సుదర్శన్‌-సంపత్‌-నరేష్‌ రఘుబాబు-బ్రహ్మాజీ-సుదర్శన్‌ తదితయి
సాంకేతికత: సంగీతం: మహతి స్వర సాగర్‌, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌, రచన-దర్శకత్వం: వెంకీ కుడుము

సినిమా ద్వారా మంచి చెప్పకపోయినా పర్వాలేదు. చెడు మాత్రం చెప్పవద్దనేది నిబంధన. దీన్ని ఫాలో అయి అప్పటి దర్శకు సినిమాు తీసేవారు. ఇప్పటిలోనూ కొన్ని ఆడపాదడపా అటువంటి చిత్రాు వస్తూనేవున్నాయి. అలాంటి కోవలోనిదే ‘భీష్మ’. రైతు దళారు చేతిలో మోస పోతున్నారంటూ... దాన్ని  అరికట్టాని రాస్తారోకోు, ఆత్మహత్యు కూడా చేసుకుంటున్నా ప్రభుత్వాు  కంటితుడుపుగా ఏవో చర్యు తీసుకుంటున్న రోజుల్లో అటు యువతకూ, ఇటు రైతుకు, మరోవైపు దళారుకు, ఇంకోవైపు ప్రభుత్వాన్ని ఆలోచించేలా చేసిన చిత్రమే ‘భీష్మ’. ‘ఛలో’తో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌ను తీసిన దర్శకుడు వెంకీ కుడుమకు ఇది ద్వితీయ ప్రయత్నం. సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కు ఇది మంచి ప్రయత్నం. నిర్మాతు సరేసరే.. ఇప్పటికే అవైకుంఠపురంలో వంటి హిట్‌ను కొట్టేశారు. మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం. 
కథ:
భీష్మ (నితిన్‌) డిగ్రీ కూడా పూర్తి చేయకుండా జీవితంలో ఓ క్ష్యమంటూ లేకుండా తిరుగుతున్న కుర్రాడు. మిగతా కుర్రాళ్లలా తనకూ ఓ గర్ల్‌ ఫ్రెండ్‌ కావాని తపించిపోతుంటాడు. అతడికి అనుకోకుండా ఛైత్ర (రష్మిక మందన్న) పరిచయమవుతుంది. ఆమె సేంద్రియ వ్యవసాయాన్ని ప్రమోట్‌ చేసే భీష్మ ఆర్గానిక్స్‌ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగి. ఆమె వెంట పడి నెమ్మదిగా తనను ఇంప్రెస్‌ చేస్తాడు భీష్మ. ఇంతలో భీష్మ ఆర్గానిక్స్‌ సంస్థ అధినేత (అనంత్‌ నాగ్‌) విచిత్రమైన పరిస్థితు మధ్య భీష్మను తన సంస్థకు సీఈవోగా ప్రకటిస్తాడు. డిగ్రీ కూడా పూర్తి చేయని భీష్మను అంత పెద్ద సంస్థకు సీఈవోగా చేయడానికి కారణమేంటి.. అంత పెద్ద పదవిలోకి వచ్చిన భీష్మ సంస్థను ఎలా నడిపించాడు.. ప్రత్యర్థు నుంచి దాన్ని ఎలా కాపాడాడు.. అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
పురుగు మందు పేరుతో పంటకు ఎరువు రూపంలో విప్రయోగం జరుగుతుంది. వేసిన మందు భూమిలో ఇంకిపోతుంది. వాన వస్తే వాగుల్లో కలిసిపోతుంది. తాగే నీరు తినే తిండి కుషితం అయిపోతుంది. ఇదే కొనసాగితే మనిషి  30 ఏళ్ళకు మించి బతకడు. మనిషి ఆయురార్థం తగ్గిపోతుంది. అందుకే రైతుకు భరోసాగా నిచే సంస్థ భీష్మ ఆర్గానిక్‌. మరోవైపు తక్కువ రోజుల్లో ఎక్కువ పంట పండిరచే వ్యసాయం పేరుతో ఎరువుల్ని వాడి లాభం పొందండి. ఒకప్పుడు టెస్ట్‌ మ్యాచ్‌ు వుండేవి. ఇప్పుడు ఆ ఓపిక జనాకు లేదు. అందుకే 20`20 వచ్చేసింది. అంటే తక్కువ టైంలో ఎక్కువ లాభం.. అని రైతుల్ని రెచ్చగొట్టి.. ఆశచూపేది మరో సంస్థ. వీరి మధ్య జరిగే వారే ఈ చిత్ర కథ. ఈ రెండిరటినీ చక్కగా బ్యాలెన్స్‌ చేస్తూ సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పట్టు వున్న దర్శకుడు వెంకీ చేసిన ప్రయత్నం అభినందనీయం. వీరిద్దరి మధ్య హీరో భీష్మ ఎలా ఎంట్రీ ఇచ్చాడు.  అనేది చిత్రంలో ఆసక్తికర పాయింట్‌. సినిమాటిక్‌గా తీసినా వ్యవసాయాన్ని వ్యాపారంగా చూస్తే ఎటువంటి అనర్థాు జరుగుతాయనేది దర్శకుడు విశ్లేషించిన తీరు బాగుంది.  ఈ మధ్యలో హీరో హీరోయిన్ల మధ్య జరిగే ప్రేమాయణం ఆసక్తిగా వుంటూ ఎంటర్‌టైన్‌ చేస్తుంది.  
సినిమా చూసి బయటికొచ్చాక ఇలాంటి సినిమాు చాలా చూశాం కదా.. ఏముంది ఇందులో ప్రత్యేకత అని అనిపిస్తే అనిపించొచ్చేమో కానీ.. థియేటర్లో ఉన్నంతసేపూ ప్రేక్షకుడిని కావాల్సినంత వినోదం ఇస్తుంది. కథాకథనా సంగతెలా ఉన్నా.. సింపుల్‌గా ఉంటూనే సరదాగా సాగిపోయే సన్నివేశాు.. ప్లెజెంట్‌ ఫీలింగ్‌ ఇచ్చే పాత్రు.. వబుల్‌గా అనిపించే ఆర్టిస్టు.. గిలిగింతు పెట్టే డైలాగు.. కంటికింపుగా అనిపించే విజువల్స్‌.. రిచ్‌ ప్రొడక్షన్‌ వ్యాూస్‌.. ఇవన్నీ కలిసి ‘భీష్మ’ను ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్టైనర్‌గా మార్చాయి. దీనికి ప్రధాన కారణం వెన్నె కిశోర్‌ పాత్ర తీరు. దర్శకుడు త్రివిక్రమ్‌ శిష్యుడు కాబట్టి మంచి టైమింగ్‌ డైలాగ్‌ు, పంచ్‌ు పెట్టాడు.  ప్రతి సన్నివేశంలో కొసమెరుపులా అనిపించే చిన్న చిన్న ట్విస్టు ఆసక్తి రేకెత్తిస్తాయి.
ద్వితీయార్ధమంతా సేంద్రియ వ్యవసాయం చుట్టూనే తిరిగినా.. వెంకీ ‘కమర్షియాలిటీ’ ఫ్యాక్టర్‌ మాత్రం మిస్‌ కాలేదు. సమస్యను దాని పరిష్కార మార్గాల్ని ఎంత ప్రభావవంతంగా చూపించారన్నది పక్కన పెడితే.. వినోదం మాత్రం తగ్గకుండా చూసుకున్నాడు దర్శకుడు. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం నెమ్మదించినా.. ప్రి క్లైమాక్స్‌.. క్లైమాక్స్‌ మరీ సినిమాటిగ్గా అనిపించడం.. వినీ తేలిపోవడం.. హీరోకు సవాన్నదే లేకపోవడం ‘భీష్మ’లో లోపాలే. కానీ ఎక్కడా పెద్దగా గ్యాప్‌ లేకుండా కామెడీ డోస్‌ పడుతుండటం వ్ల ‘భీష్మ’ బోర్‌ అయితే కొట్టించదు. ఓవరాల్‌ గా చెప్పాంటే.. ‘భీష్మ’ కొత్తగా అనిపించే.. ప్రత్యేకమైన సినిమా కాదు. కానీ సరదాగా సాగిపోతూ చూస్తున్నంతసేపూ ఎంటర్టైన్‌ చేస్తుంది.
మహతి స్వర సాగర్‌ సంగీతం వినసొంపుగా వుంది. నేపథ్య సంగీతం ఓకే. సాయిశ్రీరామ్‌ విజువల్స్‌ బాగున్నాయి. ప్రొడక్షన్‌ వ్యాూస్‌ లో రాజీ లేకపోవడం అతడికి కలిసొచ్చింది. ఒక పెద్ద హీరో సినిమా స్థాయిలో నిర్మాణ మిమ పాటించింది సితార ఎంటర్టైన్మెంట్స్‌. ఈ తరంలో కామెడీని బాగా డీల్‌ చేయగ దర్శకుల్లో ఒకటిగా వెంకీ కనిపిస్తాడు. అందరూ కలిసి చూడగలిగే చిత్రమిది.