‘ఛలో’తో వెంకీకి, ‘భీష్మ’తో నాకు బ్రేక్‌: నితిన్‌

‘ఛలో’తో వెంకీకి, ‘భీష్మ’తో నాకు బ్రేక్‌: నితిన్‌

            ‘‘నాుగేళ్ల తర్వాత నాకు హిట్‌ వచ్చింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహతి సాగర్‌ ఇచ్చిన రీరికార్డింగ్‌ ఈ సినిమాకు పెద్ద ప్లస్‌. రష్మికతో కంటే సంపత్‌ రాజ్‌తో నా కెమిస్ట్రీ ఇంకా బాగా వర్కవుట్‌ అయ్యిందని అంటున్నారు. ‘ఛలో’తో వెంకీకి, ‘భీష్మ’తో నాకు రష్మిక బ్రేక్‌ ఇచ్చింది. తను ఇంకా ఎన్నో హిట్లు కొట్టి ఇంకా ఎత్తుకు ఎదగాని కోరుకుంటున్నా. ‘అ ఆ’తో నా కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్టిచ్చిన బ్యానర్‌లోనే నాకు మళ్లీ హిట్‌ వచ్చింది. ఈ సంస్థలో మరెన్నో సినిమాు చెయ్యాని కోరుకుంటున్నా’’ అని నితిన్‌ చెప్పారు. నితిన్‌ టైటిల్‌ రోల్‌ పోషించిన ‘భీష్మ’ ఈనె21 విడుదలై ఘన విజయం సాధించింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుము దర్శకుడు. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గేయరచయిత కాసర్ల శ్యామ్‌ మాట్లాడుతూ, ‘‘క్లైమాక్స్‌ ముందు వచ్చే ‘వాటే బ్యూటీ’ పాట రాశాను. దానికి వచ్చిన రెస్పాన్స్‌ చూసి చాలా ఆనందం వేసింది. మహతి సాగర్‌ చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ‘భీష్మ’ ఇంత పెద్ద హిట్‌ కావడం చాలా ఆనందాన్నిస్తోంది’’ అన్నారు. ఇది ‘హాసమ్‌’ సక్సెస్‌ అని మరో గేయరచయిత శ్రీమణి అన్నారు. ఈ బ్యానర్‌ తో ‘జులాయి’ సినిమా నుంచి అనుబంధం ఉందని చెప్పారు. సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్‌ మాట్లాడుతూ, ‘‘మా తండ్రు గర్వపడేలా ‘భీష్మ’ను వెంకీ రూపొందించారు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్‌ కావడం చాలా ఆనందాన్నిస్తోంది’’ అన్నారు. ‘భీష్మ’ సక్సెస్‌ తనకు చాలా ఆనందాన్నిచ్చిందని సీనియర్‌ నటుడు శుభలేఖ సుధాకర్‌ చెప్పారు. అందరూ సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారని అన్నారు. నటుడు సంపత్‌ రాజ్‌ మాట్లాడుతూ, ‘‘నాకు ‘తియ్యరా బండి’ అనే డైలాగ్‌ చెప్పీ చెప్పీ విసుగొచ్చేసింది. ఈ సినిమాలో దానికి భిన్నమైన క్యారెక్టర్‌ ఇచ్చారు డైరెక్టర్‌. దానికి ప్రశంసు రావడం హ్యాపీ. అందరూ ఈ సినిమా గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సినిమా తీసిన, నన్ను ఇందులో తీసుకున్న నిర్మాతకు థాంక్స్‌. నితిన్‌ చాలా బాగా చేశారు. ఆయనకు మరెన్నో హిట్లు రావాని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. ఈ మూవీని డిస్ట్రిబ్యూట్‌ చేసిన దిల్‌ రాజు మాట్లాడుతూ, ‘‘ప్రి రిలీజ్‌ ఈవెంట్లో నేను చెప్పినట్లే ప్రేక్షకు ఈ సినిమాను సూపర్‌ హిట్‌ చేశారు. తొలి సినిమా ‘ఛలో’తో హిట్‌ కొట్టిన వెంకీ, ఇప్పుడు రెండో సినిమా ‘భీష్మ’తో సూపర్‌ హిట్‌ కొట్టాడు. ఇక హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నాడు. డైరెక్టర్‌ విజన్‌ పర్ఫెక్టుగా ఉంటే ‘భీష్మ’కు వచ్చిన ఫలితమే వస్తుంది. రష్మికలో అసాధారణ ఎనర్జీ ఉంది. హీరోతో పోటీపడుతూ డాన్స్‌ చేస్తుంది. చక్కగా నటిస్తుంది. నితిన్‌తో మేం ‘శ్రీనివాస కల్యాణం’తో హిట్‌ కొట్టానుకున్నాం కానీ, కుదరలేదు. సినిమాలో మంచి కామెడీ ఉంటే, కంటెంట్‌ బంగా ఉంటే ప్రేక్షకు హిట్‌ చేస్తారని ‘ప్రతిరోజూ పండగే’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అ వైకుంఠపురములో’, ఇప్పుడు ‘భీష్మ’ నిరూపించాయి. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకు నవ్వుతూ ఎంజాయ్‌ చేస్తూనే ఉన్నారు’’ అని చెప్పారు. దర్శకుడు వెంకీ కుడుము మాట్లాడుతూ, నా టెక్నీషియన్స్‌ అందరూ బాగా సపోర్ట్‌ చెయ్యడం వల్లే నేను అనుకున్న విధంగా సినిమా తియ్యగలిగాను. తను ఇదివరకు చేసిన పాత్రకు చాలా భిన్నమైన పాత్రను ఈ మూవీలో సంపత్‌రాజ్‌ చాలా బాగా చేశారు. అనంత్‌ నాగ్‌, జిషుసేన్‌ గుప్తా తమ పాత్రకు జీవం పోశారు. ‘దిల్‌’ సినిమా నుంచి నేను నితిన్‌ను అభిమానిస్తూ వస్తున్నా. ఆయనను అభిమానించేవాడిగానే ఈ సినిమా తీశాను. కలిసి పనిచేసేటప్పుడు ఆయన ప్రవర్తనకూ నేను అభిమానినైపోయా. నా ఊహకు భిన్నంగా కథ చెప్పగానే వెంటనే ఒప్పుకొని రష్మిక ఈ సినిమా చేసింది. తను స్నేహానికి మివ ఇచ్చింది’’ అన్నారు. హీరోయిన్‌ రష్మికా మందన్న మాట్లాడుతూ, ‘భీష్మ’ పాత్రలో నితిన్‌ను చూసినప్పుడు అతని అభిమానిని అయిపోయాను. సినిమాలో అతను కనిపించిన తీరునూ, అతని నటననూ నిజంగా ఇష్టపడ్డాను. మంచి మ్యూజిక్‌, చక్కని సినిమాటోగ్రఫీతో అన్నీ చక్కగా కుదిరిన సినిమా ఇది’ అన్నారు.