బాల‌య్య‌బాబు పుట్టిన‌రోజు గిఫ్ట్

బాల‌య్య‌బాబు పుట్టిన‌రోజు గిఫ్ట్

నందమూరి బాల‌కృష్ణ‌.. త‌న అభిమానుల‌కు పుట్టిన‌రోజునాడు గిఫ్ట్ ఇచ్చారు. గ‌త రెండు రోజులుగా.. ఆయ‌న ఓ పాట‌ను పాడుతున్న‌ట్లు తెలిసిందే. దానిని మంగ‌ళ‌వారంనాడు విడుద‌ల‌చేశారు. బాల‌కృష్ణ త‌న 60వ పుట్టిన‌రోజు బుధ‌వారంనాడు అంటే జూన్ 10న సంద‌ర్భంగా పాట‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు. 
 తన తండ్రి ఎన్టీఆర్‌ నటించిన ‘జగదేకవీరుని కథ’ చిత్రంలోని ‘శివశంకరీ శివానందలహరి’ పాటను బాలయ్య స్వయంగా పాడారు. ఎన్‌బికె ఫిల్మ్స్ యూట్యూబ్ చానెల్ ద్వారా ఈ పాటను విడుదల చేశారు. బాలయ్య ఇలాంటి కష్టమైన పాటను, చాలా ఇష్టంగా ఆలపించి తనవంతు కృషిచేసి సఫలమయ్యారు. నిజంగా ఇది అభిమానులకు మరిచిపోలేని బాహుమతి. బాలకృష్ణ ఎప్పుడు మాట్లాడినా ‘అభిమానులే దేవుళ్లు’ వాళ్ల కోసం మనం ఏం చేసినా, ఎంత చేసినా తక్కువే అంటూ చెప్తుంటారు. ప్రస్తుతం ఈ పాట సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. బాలకృష్ణ అంటే డైలాగేలే కాదు. ఇలాంటి కష్టమైన, మధురమైన పాటలను కూడా అవలీలగా తనగొంతులో వినిపించగలరని నిరూపించారు.
మ‌రోవైపు అభిమానుల‌కు త‌గు జాగ్ర‌త్త‌లు విడుద‌ల చేశారు. క‌రోనా టైంలో అంద‌రూ జాగ్ర‌త్త‌గా వుండాల‌ని త‌న‌ను క‌ల‌వ‌డానికి ఎవ్వ‌రూ రావ‌ద్ద‌ని లిఖిత‌పూర్వ‌కంగా తెలియ‌జేశారు.