హుషారు ఫేమ్ తేజ్ ప్రేమ‌క‌థ‌

హుషారు ఫేమ్ తేజ్  కూరపాటి ప్రేమ‌క‌థ‌
  

హుషారు  ఫేమ్  తేజ్  కూరపాటి , అఖిల ఆకర్షణ, జంటగా  కల్పనా రెడ్డి, తనికెళ్ళ భరణి , జీవ, జోగి  బ్రదర్స్ ,  ప్రధాన  పాత్రలలో  న‌టిస్తున్న తాజా చిత్రం షూటింగ్ జ‌రుపుకుంది.
జి .వి .ఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో  రాజధాని ఆర్ట్ మూవీస్  నిర్మాణంలో ముల్లేటి కమలాక్షి గుబ్బల వేంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఆహ్లాదకరమైన గ్రామీణ నేపధ్యంలో తెరకెక్కుతుంది.  తేజ్ కూరపాటి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ తేజ్  కూరపాటికి  మంగ‌ళ‌వారంనాడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ  పరిశర ప్రాంతాల్లో  షూటింగ్ జరుపుకుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ....
 దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు,  సినిమా బాగా వచ్చింది, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఒక లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతొందని తెలిపారు.

దర్శకుడు వెంకట్ వందెల మాట్లడుతూ....
హుషారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ్ ఈ సినిమాలో మరో డిఫరెంట్ రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఎక్కడా కాంప్రమైజ్ కానివ్వకుండా సినిమా తియ్యటానికి పూర్తి సహకారం అందిస్తున్నారు. మనకు తెలీకుండా మనలో ప్రేమ పుట్టినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఆ ప్రేమ ఒక వ్యక్తి ద్వారా పుట్టిందని తెలిసినప్పుడు ఆ వ్యక్తి కోసం  ఎంత దూరమైన వెళ్లాలనిపిస్తుందనే సస్పెన్స్ క్యూట్ లవ్ స్టొరీ ఇది. 

నటి నటులు:
తనికెళ్ళ భరణి , జీవ, జోగి  బ్రదర్స్ , కల్పనా రెడ్డి, బస్ స్టాప్ కోటేశ్వరావు , డా . ప్రసాద్ , మాధవి , సునీత మనోహర్ , అనంత్ 

సాంకేతిక నిపుణులు :
నిర్మాతలు: ముల్లేటి కమలాక్షి గుబ్బల వెంకటేశ్వర రావు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: వెంకట్ వందెల
సంగీతం: సందీప్ కుమార్
స్క్రీన్ ప్లే, లిరిక్స్: డాక్టర్ భవ్య దీప్తి రెడ్డి
కెమెరామెన్: వంశీ ప్రకాష్
ఎడిటింగ్: కె.రవికుమార్
కొరియోగ్రాఫర్: గణేష్ స్వామి, నండెపు రమేష్
స్టంట్స్: రామకృష్ణ
చీఫ్ కో డైరెక్టర్: ఎల్.రామకృష్ణం రాజు
పిఆరోఓ: సాయి సతీష్

News_Tags: