ఏడాదిగా కుద‌ర‌లేదుః చిరంజీవి

ఏడాదిగా కుద‌ర‌లేదుః చిరంజీవి
         

ఎ.పి. ముఖ్య‌మంత్రిని ఏడాదిపాటుగా క‌ల‌వాల‌ని అనుకున్నామ‌నీ, కానీ కుద‌ర‌లేద‌నీ. ఇప్ప‌టికి కుదిరింద‌ని.. క‌రోనా త‌ర్వాత షూటింగ్ విష‌యాల‌పై చ‌ర్చించేందుకు మంగ‌ళ‌వారంనాడు విజ‌య‌వాడ‌లో క‌లిసిన సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయ‌న‌తోపాటు నాగార్జున‌, దిల్‌రాజు, సి.క‌ళ్యాణ్‌, దాము, రాజ‌మౌళి, డి.సురేష్‌బాబు త‌దిత‌రులు వున్నారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..  కరోనా కారణంగా షూటింగ్ లేక ఇబ్బంది పడ్డాము. ఇక్కడా జగన్ గారు కూడా షూటింగ్‌ల‌కు అనుమ‌తి ఇచ్చారు. 
ముఖ్యంగా థియేట‌ర్‌ లు మినిమం ఫిక్స్డ్ ఛార్జ్ లు ఎత్తివేయాలని కోరాం. నంది వేడుకలు పెండింగ్ ఉన్నాయి.. ప్రభుత్వం నుంచి మేము ప్రోత్సాహం కోరుకుంటాం. 2019-20 కి అవార్డుల వేడుక జరుగుతుందని భావిస్తున్నాం. టికెట్స్ ధరల ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని కోరాం.. వీటిని జ‌గ‌న్‌గారు పరిశీలిస్తాం అన్నారని తెలియ‌జేశారు. అలాగే వై.ఎస్‌. హ‌యాంలో వైజాగ్ లో స్టూడియో కి   భూమి ఇచ్చారు...దానిలో పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం. దానిని ఒక‌సారి ప‌రిశీలించ‌మ‌ని కోరామ‌ని అన్నారు.