20 ఏళ్ళ కెరీర్‌లో నా 'మైండ్‌బ్లాక్‌' అయింది: మహేష్‌బాబు

20 ఏళ్ళ కెరీర్‌లో నా 'మైండ్‌బ్లాక్‌' అయింది: మహేష్‌బాబు

    ''అల్లూరి సీతారామరాజు ట్రాక్‌ రాగానే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో నాకు గూజ్‌బంప్స్‌ వచ్చాయి. అలాగే 'మైండ్‌బ్లాక్‌' అనే సాంగ్‌ను దర్శకుడు చేయమన్నారు. ఇలా చేయడం నాకు కొత్తే. కానీ వారు ఏమనుకున్నారోకానీ.. ఇవాళ ఆ సాంగ్‌కు రియాక్షన్‌ చూసి నేనే నమ్మలేకపోతున్నాను. పాటకే ఎక్కువ రియాక్షన్‌ వచ్చింది. 20 ఏళ్ళ కెరీర్‌లో మైండ్‌బ్లాక్‌కు వచ్చిన అప్లాజ్‌ దేనికీ రాలేదు'' అని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. ఈనెల 11న విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం విజయవంతమైన టాక్‌తో రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చిత్ర యూనిట్‌ థ్యాంక్స్‌ మీట్‌ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడుతూ... నాన్నగారి అభిమానులు, నా అభిమానులు సంక్రాంతి పండగ 12నే ఇచ్చారు. నిర్మాతలు నిన్న మొదటిరోజే షేర్స్‌ గురించి మాట్లాడుకుంటుంటే మ్యాజిక్‌గా ఫీలయ్యాను. ఈ చిత్రానికి పనిచేసిన టెక్నిల్‌ టీమ్‌ యుగందర్‌, తమ్మిరాజు, శేఖర్‌మాస్టర్‌, నటీనటులు అందరూ థ్యాంక్స్‌. నేను సహజంగా మొదటిరోజు పిల్లల్తో సినిమా చూస్తాను. అది నాకు సెంటిమెంట్‌. సినిమా చూశాక.. విజయశాంతిగారిని ఈవెనింగ్‌ కలిశాను. ఆమె తప్ప ఎవ్వరూ ఆ పాత్ర చేయలేరు. రామ్‌లక్ష్మణ్‌లు బాగా నచ్చారు. ఎందుకంటే వారు ఆడియన్‌లా ఆలోచిస్తారు. అందుకే కథంతా చెప్పమన్నాను. 'దూకుడు' తర్వాత అన్ని మంచి చిత్రాలే చేశాను. 'శ్రీమంతుడు, భరత్‌అనే నేను, మహర్షి.. చిత్రాల స్క్రిప్ట్‌కు సరెండ్‌ అవ్వాలి. 'ఎఫ్‌2' చేస్తున్నటైంలో అనిల్‌ నాకు కథ చెప్పారు. ఆ టైంలో నేను మరో కమిట్‌మెంట్‌తో వున్నాను. తనూ 'ఎఫ్‌2'తో బిజీగా అయ్యాడు. ఎఫ్‌2 చూశాక.. వెంటనే ఈ కథ చేసేయాలిపించింది. తను అప్పటికే స్క్రిప్ట్‌తో రెడీగా వున్నాడు. రస్మిక బాగా నటించింది. నిన్నటినుంచి నాకు జర్నీ కొత్తగా వుంది. నాన్నగారి అభిమానులుకానీ, నా అభిమానులు కానీ నా పెర్‌ఫార్మెన్స్‌కు రియాక్ట్‌ అయిన విధానం చాలా బాగుంది. ఆ క్రెడిట్‌ అంతా దర్శకుడు అనిల్‌దే. ఇక దేవీ మ్యూజిక్‌ చేస్తే చాలా పీస్‌ఫుల్‌గా వుంటుంది. సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ ఇంపార్‌టెంట్‌. తను బాగా ఇచ్చాడు. అనిల్‌ సుంకరగారు 'దూకుడు' నుంచి పరిచయం. నాన్నగారంటే ఇష్టం. ఆయన మాటలకంటే బాడీ లాంగ్వేజ్‌ ఇష్టం. అలాగే దిల్‌రాజు, మాది హ్యాట్రిక్‌ కాంబినేషన్‌ ఇలాగే డబుల్‌ కొట్టాలి' అని తెలిపారు. 

నేనేనా! సినిమా తీసింది అనిపించింది.

దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ...ఈ కథలో ప్రొఫెసర్‌ పాత్రకు విజయశాంతి తప్ప మరో రీప్లేస్‌మెంట్‌ లేదు. ప్రీ క్లెయిమాక్స్‌లో ఇంపార్‌టెంట్‌ మేటర్‌ను అద్భుతంగా పండించారు. ఇందులో ఆమె విలువ నెక్ట్స్‌వీక్‌ కూడా చూస్తారు. పోస్టర్‌లో బ్లాక్‌బస్టర్‌గా బాప్‌.. అని టాగ్‌ పెట్టారు. అలా ఎందుకు పెట్టామంటే.. ప్రతి సినిమాకూ బాగుంది, బ్లాక్‌బస్టర్‌ అనేది మామూలు మాటలు. నిన్నటినుంచి ఒకటే టాక్‌.. 'బొమ్మ దద్దరిల్లిపోయింది' అనే చెబుతున్నారు. అందుకే అలా పెట్టాం. సినిమాలో ఓపెనింగ్‌ సీన్‌ పేట్రియాటిజయంతోనూ, ఆ తర్వాత ట్రెయిన్‌ ఎపిసోడ్‌, తర్వాత కర్నూలు ఎపిసోడ్‌లో వచ్చే యాక్షన్‌ సీన్స్‌, సెకండాప్‌లో విజయశాంతి ఎమోషన్స్‌, ప్రకాష్‌రాజ్‌తో మహేష్‌ పొలిటికల్‌ డైలాగ్స్‌ ఇవన్నీ సినిమాను బ్లాక్‌బస్టర్‌కా బాప్‌ అనేలా చేశాయి. సినిమా చూశాక ప్రేక్షకులు ఓన్‌ చేసుకుని మాట్లాడుతున్నారు. ఇక మేనరిజం, టేక్‌బో, నెవర్‌ బిఫోర్‌ ఆఫ్టర్‌, కూజాలు చెంబులవుతాయి.. వంటివి ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. ఈ సినిమాను చూశాక 'బాహుబలి'లో శివుడ్ని మోసినట్లు.. మహేష్‌బాబు ఈ సినిమా మోశారు. నెక్ట్స్‌వీక్‌ దాన్ని ఎక్కడో పెడతారు. అలాగే ఈ సినిమాలో అజయ్‌ పాత్ర అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. అల్లూరి సీతారామరాజు పాత్ర తెలుగు చరిత్రలో గుర్తిండిపోయే పాత్ర. అది కథలో కలిసిపోయింది. అందులో ఆయన ప్రజల సైనికుడు. ఇక్కడ హీరో సైనికుడు. ఈ ఎపిసోడ్‌ గురించి మరోలా అనుకున్నాం. కానీ రామ్‌లక్ష్మణ్‌లు ఇంటర్‌వెల్‌లో ఫోర్స్‌ కావాలంటూ చెప్పారు. రెండు రోజులు ఆలోచించాం. అప్పుడు పుట్టిన ఆలోచన అది. మీ జడ్జిమెంట్‌కు థ్యాంక్స్‌. ఈ సినిమా చూశాక ఓ అమ్మాయి మెసేజ్‌ పెట్టింది. తన తండ్రి ఆర్మీలో వున్నారట. వారి కూడా కనెక్ట్‌ అయి మాకు చెప్పడం చాలా ఆనందంగా వుంది. అలాగే దేవీ తల్లిగారు ఫోన్‌చేసి బాగా మాట్లాడారు. ఇక మహేష్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. మార్నింగ్‌ షో తర్వాత అద్భుతం జరిగింది. ఆయన అభిమానులు, ప్రేక్షకుల మధ్య సినిమా చూస్తుంటే నేనేనా! సినిమా తీసింది అనిపించింది. మధ్యాహ్నమే నిర్మాత శిరీష్‌తో మాట్లాడాను.. 'అయింది ఒక్కరోజే పిక్చర్‌ బాకీహై దోస్త్‌' అంటూ అన్నాడు.  ఈ సినిమాలో ఓ డైలాగ్‌ వుంది. 'రమణ లోడ్‌ ఎత్తరా.. చెక్‌పోస్టు పడతాది' అని, రేపటినుంచి 'రమణ బండి తీయరా! షో టైం అయితాదీ' అంటారు ప్రేక్షకులు. ఈ చిత్రం కుటుంబంతో చూసి నవ్వులు తీసుకెళ్ళండి..' అన్నారు.

ఆటోమేటిక్‌గా ఏడుపు వచ్చేసింది.

విజయశాంతి మాట్లాడుతూ... 13 ఏళ్ళతర్వాత రీ ఎంట్రీ మంచి సినిమాతో చేయడం చాలా సంతోషంగావ ఉంది. అనిల్‌గారికి థ్యాంక్స్‌. మొదట సినిమాలు చేయకూడదని భీష్మించుకున్నాను. నాలో ఆలోచన పుట్టి చేసేలా చేసింది దర్శకుడు. కొంత టైం తీసుకున్నాక కథ విన్నాను. వెంటనే చేస్తానని నిర్ణయం తీసుకున్నా. ఈ సినిమా చేయడం మంచి అనుభూతి. ముఖ్యంగా మహేష్‌తో పనిచేయడం... చిన్నప్పుడు నటించాను. మళ్లీ సూపర్‌స్టార్‌ అయ్యాక చేయడం చాలా గొప్పగా అనిపించింది. 'కొడుకు దిద్దిన కాపురం' పెద్ద హిట్‌. ఇప్పుడు 'సరిలేరు' అంతకంటే పెద్ద హిట్టు. నిన్న రిలీజ్‌ అయ్యాక ప్రతివారూ ఫోన్‌ చేసి అద్భుతంగా చేశారమ్మా! ఏడిపించారమ్నా! అంటూ మాట్లాడుతున్నారు. గతంలో 'ఒసేయ్‌ రాములమ్మ', ప్రతిఘటన, కర్తవ్యం'లో ఎంత బరువైన పాత్ర చేశానో అంతకంటే బరువైన పాత్ర సినిమాలో చేశాను. క్లయిమాక్స్‌ సీన్‌లో పొద్దునే సీన్‌లో కూర్చున్నాక.. సాయంత్రం వరకు అలాగే కూర్చున్నా.. ఆ సీన్‌ చేస్తున్నంతసేపు తెలీని బాధ వచ్చేసింది. సహజంగా గ్లిజరిన్‌ వాడతారు. కానీ ఆటోమేటిక్‌గా ఏడుపు వచ్చేసింది. లీనమైపోయాను. సినిమా చూశాక ప్రతీ డైలాగ్‌ చెబుతున్నారంటే.. ఎంత పెద్ద హిట్‌ అయితే అర్థమయింది. జవాన్ల తల్లులు ఎంత త్యాగం చేస్తున్నారో ఈ సినిమా చూశాక అర్థమయింది. జవాన్లకు మదర్‌ ఇండియాలా ఈ సినిమా అయిందని తెలియజేస్తున్నాను' అని తెలిపారు. నిర్మాతలు అనిల్‌ సుంకర, దిల్‌రాజు మాట్లాడుతూ.. చిత్ర విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.